థైరాయిడ్ సమస్యను ఇలా ఎదుర్కొండి!

19
- Advertisement -

నేటి రోజుల్లో థైరాయిడ్ తో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా పురుషుల కంటే మహిళలే ఈ సమస్యతో ఎక్కువగా బాధ పడుతున్నట్లు నివేధికలు చెబుతున్నాయి. గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిలో ఏర్పడే అసమానతల వల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. ఇది ఒక ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్య.. కాబట్టి థైరాయిడ్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇందులో హైపో థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అని రెండు రకాలు ఉన్నాయి. హైపో థైరాయిడ్ లో మలబద్దకం, నీరసం, బరువు పెరగడం, అధిక నిద్ర, చర్మం పాలిపోవడం, వెంట్రుకలు పలచబడి రాలిపోవడం, ఇలా కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఇక హైపర్ థైరాయిడ్ విషయానికొస్తే.. ఇందులో కూడా పై లక్షణాలతో పాటు విపరీతమైన ఆకలి, చిరాకు, మతిస్థిమితం, గొంతు నొప్పి, గొంతు ముందు వాపు. వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి..

థైరాయిడ్ బారిన పడిన ఆడవారిలో నెలసరి సమస్యలు కూడా కనిపిస్తాయి. గర్భిణీలు థైరాయిడ్ బారిన పడితే పుట్టబోయే బిడ్డపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి థైరాయిడ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన వైద్యం తీసుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు ప్రతిరోజూ వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో సమతుల్యత ఏర్పడి థైరాయిడ్ సమస్యను అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా తినే ఆహారంలో కూడా విటమిన్ ఏ, బి3, బి6, ఉండేలా చూసుకోవాలి. నీరు అధికంగా తాగాలి. కూరగాయలు, చేపలు, గుడ్లు, వంటివి డైలీ ఆహార డైట్ లో చేర్చుకోవాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల థైరాయిడ్ సమస్యను త్వరగా అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:Congress: ఏదైనా సరే.. ఛలో డిల్లీ?

- Advertisement -