డెబిట్ కార్డు లేకుండానే..యూపీఐ యాప్స్ వాడండిలా!

11
- Advertisement -

నేటి రోజుల్లో యూపీఐ యాప్స్ వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎలాంటి డిజిటల్ లావాదేవీలు జరపాలన్న యూపీఐ యాప్స్ ఉపయోగించి మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాము. ఏదైనా షాప్ లో వస్తువు కొనుగోలు చేయాలన్న, లేదా ఎవరికైనా మనీ సెండ్ చేయాలన్న వెంటనే మొబైల్ లో ఉన్న గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే.. ఇలా ఏదో ఒక యూపీఐ యాప్ ఉపయోగించి వర్చువల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాము. అయితే ఈ యూపీఐ యాప్స్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ జరపాలంటే డెబిట్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే యూపీఐ యాప్స్ ద్వారా మనీ లావాదేవీలు జరపాలంటే బ్యాంకు అకౌంట్ కచ్చితంగా లింక్ చేయాల్సి ఉంటుంది..

అలా లింక్ చేసిన తర్వాత యూపీఐ పిన్ జనరేట్ చేసేటప్పుడు డెబిట్ కార్డు తప్పనిసరి ఉండాలి. డెబిట్ కార్డ్ డిటేల్స్ ఎంటర్ చేసిన తరువాతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ యాక్టివేట్ అవుతాయి. అయితే ప్రస్తుతం డెబిట్ కార్డు అవసరం లేకుండానే సంబంధిత బ్యాంకు ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ను జరిపే వీలు కల్పించింది ఆర్బీఐ. అది ఎలాగో చూద్దాం !

ముందుగా ఏదైనా యూపీఐ యాప్ ను ఫోన్ లో ఇంస్టాల్ చేసిన తర్వాత యాడ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ యాడ్ న్యూ బ్యాంక్ వద్ద మీ యొక్క సంబంధిత బ్యాంకును ఎంటర్ చేయాలి. తర్వాత యూపీఐ పిన్ జనరేట్ చేసుకునేందుకు డెబిట్ కార్డు డిటేల్స్ లేదా వయా ఆధార్ డిటేల్స్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. డెబిట్ కార్డు లేకపోతే ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయగానే ఆధార్ సంబంధిత మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. అలా చేయగానే జనరేట్ న్యూ యూపీఐ పిన్ అని కనిపిస్తుంది. అక్కడ పిన్ సెట్ చేసుకొని నగదు లావాదేవీలు సులభంగా చేయవచ్చు. ఇలా డెబిట్ కార్డు లేని పక్షంలో కేవలం ఆధార్ ద్వారా యూపీఐ యాప్స్ ఉపయోగించవచ్చు.

Also Read:తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్

- Advertisement -