అందం,అభినయం రెండు కలబోసిన సౌందర్య శిల్పం త్రిష. తన అందాల వర్షంలో ప్రేక్షకులని తడిపి ముద్దచేసిన మనోహరి. మోడలింగ్ రంగం నుంచి వెండితెరపై తళుక్కుమన్న ఈ చెన్నై బ్యూటీ తెలుగు,తమిళ్ ఇండస్ట్రీలో అగ్రహీరోలతో నటించి మెప్పించింది. ఇక రీసెంట్‌గా పొన్నియన్ సెల్వన్‌తో సక్సెస్ కొట్టిన ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్‌ని గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది.
ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సంతకాలు చేసింది. తమిళ హీరో విజయ్‌తో పాటు తెలుగులో రెండు సినిమాలకు ఓకే చెప్పింది. అయితే ఇందులో ఓ మూవీలో వేశ్య పాత్రలో నటించనుందట త్రిష. తన అభిమాన నటుడు కమల్ హాసన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ పాత్రకు ఓకే చెప్పేసిందట. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన గంగుబాయ్ కత్తియవాడి సినిమా ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే త్రిష ఇలాంటి రిస్కీ పాత్రను ఎంచుకోవడం ఆమె కెరీర్‌ను రిస్క్‌లో పెట్టుకోవడమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి త్రిష తీసుకున్న నిర్ణయం సరైందో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచిచూడాల్సిందే.
ఇవి కూడా చదవండి..