ఉద్యోగాల కోత..ఇప్పుడు గూగుల్ వంతు!

234
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల కోతకు సిద్ధమయ్యాయి కంపెనీలు. ఇప్పటికే మెటా, ట్విట్టర్, అమెజాన్‌ ఉద్యోగాలకు కోత పెట్టగా తాజాగా గూగుల్ కూడా చేరింది.

దాదాపు 10 వేల మంది ఉద్యోగులకు తొలగించేందుకు గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ సిద్ధమైంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 1,87,000 మంది పనిచేస్తున్నారు. అయితే పనితీరు సరిగా లేని ఉద్యోగులపైనే వేటు వేయనున్నట్టు ఆల్ఫాబెట్ ప్రకటించింది.

అంతర్జాతీయంగా నెలకొంటున్న కఠిన పరిస్థితులే ఉద్యోగుల తొలగింపుకు కారణమని ఆల్ఫాబెట్ తెలిపింది. న్యూ ర్యాంకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్ ద్వారా పనితనం సరిగాలేని ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని బ్రాంచ్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. నూతన సంవత్సరం నుండి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభంకానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -