అమెరికా క్షిపణి దాడి..భారత నావికులు మృతి!

5
- Advertisement -

అంతర్జాతీయ సముద్ర జలాల్లో అత్యంత ఘోరమైన విషాదం చోటుచేసుకుంది. ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై అమెరికా రక్షణ దళాలు జరిపిన క్షిపణి దాడిలో ముగ్గురు భారతీయ నావికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దారుణ ఘటనను భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించింది. అమెరికా సైన్యం చేసిన ఈ దుశ్చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాషింగ్టన్‌కు తన నిరసనను తెలియజేసింది.

ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు భారతీయులను షిప్పింగ్ మంత్రిత్వ శాఖ గుర్తించింది. మరణించిన వారిలో ఆదిత్య శర్మ (డెక్ క్యాడెట్),శివానంద్ చౌరాసియా (ఇంజిన్ ఫిట్టర్),పట్నాల సురేష్ (చీఫ్ ఇంజినీర్) ఉన్నారు. దాడి జరిగిన సమయంలో సదరు నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. క్షిపణి తగలగానే నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రాణభయంతో ఉన్న నావికులను రక్షించేందుకు ఒమన్ సైన్యం తక్షణమే రంగంలోకి దిగింది. ఒమన్ నౌకాదళం సకాలంలో స్పందించి పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి నౌకలో చిక్కుకుపోయిన మిగిలిన 21 మంది భారతీయ నావికులను సురక్షితంగా రక్షించింది. ప్రస్తుతం వారికి ఒమన్‌లో వైద్య సహాయం, రక్షణ కల్పిస్తున్నారు.

Also Read:సుప్రీంకు మీనాక్షి నటరాజన్

శాంతియుతంగా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై అమెరికా దళాలు ఈ రకమైన క్షిపణి దాడికి పాల్పడటంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఒకవైపు అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భద్రత గురించి మాట్లాడే అమెరికా.. ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ దాడికి గల కారణాలపై తక్షణమే పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేసింది.

- Advertisement -