మూడు రోజులు..తేలికపాటి వర్షాలు

3
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈరోజు , రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి అయిదు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది అని వెల్లడించింది.

ఈరోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అని తెలిపింది.

Also Read:విస్తరిస్తున్న కరోనా…జాగ్రత్త!

 

- Advertisement -