హైదరాబాద్..టెక్ హబ్: కేటీఆర్

7
- Advertisement -

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వార్విక్, కోవెంట్రీలోని PDSL (ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్) యొక్క కొత్త సదుపాయాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి కేటీఆర్. PDSL అనేది యూకేకు చెందిన ఇంజినీరింగ్ సర్వీసుల కంపెనీ, ఇది ఆటోమోటివ్ రంగంలోని వారికి సేవలందిస్తుంది. PDSL డైరెక్టర్ క్రాంతి పుప్పాల ఈ సదుపాయాన్ని ప్రారంభించేందుకు BRS కార్యనిర్వాహక అధ్యక్షుడిని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ఈ కొత్త సదుపాయాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా PDSL కుటుంబానికి హార్దిక అభినందనలు. మీ డిజైన్ సొల్యూషన్స్ ప్రాగ్మాటిక్‌గా ఉందన్నారు. ఈ సంస్థ ఒక అద్భుతమైన స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇది యూకేలోని గ్రామీణ ప్రాంతాలకి నేను చేస్తున్న మొదటి సందర్శన. ఇక్కడి విశ్వవిద్యాలయాలు మరియు పరిశ్రమల మధ్య సహకారం చూసి నేను ఆశ్చర్యపోయాను అన్నారు.

గత రెండు దశాబ్దాలలో భారతదేశం డిజిటల్ విప్లవంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతి రంగానికి — ఆటోమోటివ్, టెక్నాలజీ, లాజిస్టిక్స్ — ఓ ఫ్లెక్సిబుల్ ఆఫ్షోర్ కేంద్రంగా భారత్ నిలిచింది అన్నారు. హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన టెక్ హబ్‌లలో ఒకటిగా ఎదిగింది. అనేక ప్రముఖ టెక్ కంపెనీలకు, అమెరికా వెలుపల అతిపెద్ద కేంద్రాలు మా నగరంలో ఉన్నాయి. ఉదాహరణకి, అమెజాన్‌కి సియాటిల్ కంటే పెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో ఉంది.

2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు టెక్ రంగంలో 3,23,000 మందికి ఉద్యోగాలు ఉండేవి. 2023 నాటికి ఆ సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరుకుంది. అదే విధంగా, టెక్నాలజీ ఎగుమతులు రూ.57,000 కోట్ల నుంచి రూ.2,41,000 కోట్లకు పెరిగాయి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఫార్ములా-ఈ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన మొదటి రాష్ట్రం. ఆటోమోటివ్ పరిశ్రమ భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా మరింత అభివృద్ధి చెందాలని మేము ఆశిస్తున్నాము అన్నారు.
ప్రస్తుతం తాము తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నా, నేను ఇక్కడ పెట్టుబడులను కోరడానికి వచ్చాను అన్నారు.

Also Read:విస్తరిస్తున్న కరోనా…జాగ్రత్త!

- Advertisement -