సీఎస్‌కే జట్టుకు కరోనా షాక్.. ముగ్గురికి పాజిటివ్..

61
csk

ఐపీఎల్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్‌కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారినపడగా, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ కొవిడ్ కేసుల బయట పడ్డాయి. ఆ జట్టు మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆటగాళ్లెవరికీ కరోనా సోకలేదని వెల్లడైంది.

అయితే చెన్నై టీమ్‌ సీఈవో కాశీ విశ్వనాథన్‌, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, ఒక బస్‌ క్లీనర్‌లకు వైరస్‌ సోకినట్లు తెలిసింది. నాన్‌-ప్లేయింగ్‌ మెంబర్స్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో ఫ్రాంఛైజీ అప్రమత్తమైంది. కరోనా బారినపడిన వారిని ఐసోలేషన్‌కు తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.