వరుణ్‌ సందేశ్‌ ‘ఇందువదన’ ఫస్ట్‌లుక్‌..

36
Induvadana First Look

టాలీవుడ్‌ హీరో వరుణ్‌ సందేశ్‌ చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మధ్య కాలంలో బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌లో భార్య వితికాతో కలిసి సందడి చేశారు వరుణ్‌. ఆయన హీరోగా సినిమాలు చేసి చాలా సమయమే అవుతోంది. మళ్లీ ఇప్పుడాయన రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వరుణ్‌ సందేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘ఇందువదన’.

ఫర్నాజ్‌ శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి ఎం.ఎస్‌.ఆర్‌ దర్శకుడు. మాధవి ఆదుర్తి నిర్మాత. సోమవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. షర్ట్‌ లేకుండా వరుణ్‌ సందేశ్‌, హీరోయిన్‌ను కౌగిలించుకున్న ఈ రొమాంటిక్ పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మరి ఈ రీ ఎంట్రీ సినిమాతో వరుణ్‌ సందేశ్‌కు ఎలాంటి సక్సెస్‌ దక్కుతుందో చూడాలి.