- Advertisement -
సినీ నటి రమ్యను రేప్ చేసి చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు కన్నడ హీరో దర్శన్ ఫ్యాన్స్. ఆన్‌లైన్ వేధింపుల పట్ల పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నారు రమ్య.
హీరోయిన్ పవిత్ర గౌడపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసిన కేసులో హీరో దర్శన్‌ను అరెస్టు చేశారు పోలీసులు. అయితే దర్శన్ అభిమానులు తనను కూడా వేధించారని.. రేణుకాస్వామికి, దర్శన్ అభిమానులకు ఎలాంటి తేడా లేదని పేర్కొంది నటి రమ్య.
దీంతో రేణుకాస్వామి బదులు నువ్వు చనిపోవాల్సిందని, నిన్ను రేప్ చేసి చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై బెంగుళూరు కమిషనర్‌ను కలిసి, సోషల్ మీడియాలో తనను వేధిస్తున్న వారిపై ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు రమ్య.
Also Read:సిగాచి బాధితులకు పరిహారం ఏది?
- Advertisement -

