సిగాచి బాధితులకు పరిహారం ఏది?

4
- Advertisement -

సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులకు పరిహారం ఇవ్వకుంటే కలెక్టరేట్‌ ముందు టెంట్ వేసి దీక్ష చేస్తాం.. ఉద్యమం ఉధృతం చేస్తాం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో బాధితులతో కలిసి కలెక్టర్‌ను కలిశారు మాజీ మంత్రి హరీశ్ రావు.

పరిహారం వారానికి ఇస్తారా, 10 రోజులకు ఇస్తారా స్పష్టమైన తేదీ చెప్పండి… ప్రమాదంలో మరణించిన వారికి రూ.1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలంటూ సంగారెడ్డి కలెక్టర్‌ను హెచ్చరించారు.

సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగి నెలరోజులు గడుస్తున్నా ఇంతవరకు మా వాళ్ల ఆచూకీ లేదు … కనీసం డెడ్ బాడీ లేకపోయినా మిస్సింగ్ అని మునిసిపల్ అధికారులను లెటర్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు అని బాధితులు మండిపడ్డారు.

Also Read:Pant :ఐదో టెస్టుకు పంత్ దూరం

- Advertisement -