తెలంగాణలో ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈనెల 31 నుంచి నియోజకవర్గాల్లో మీనాక్షి పాదయాత్ర చేపట్టనున్నారు. వారం రోజుల పాటు నియోజవర్గాల్లో పాదయాత్ర సాగనుంది.
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధోల్, అర్ముర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో పాదయాత్ర జరగనుంది.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని బిర్లాగ్రామ్ నగ్డాలో జన్మించారు మీనాక్షి. బయో కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయగా ఎన్ఎస్ యూఐ లో చేరిక ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999 నుంచి 2002 వరకు NSUI అధ్యక్షురాలిగా పనిచేశారు. 2002-2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008లో AICC కార్యదర్శిగా ఎంపిక కాగా 2009 నుంచి 2014 వరకు మందసౌర్ నుండి ఎంపీగా గెలుపొందారు.
Also Read:Pant :ఐదో టెస్టుకు పంత్ దూరం

