ఆకట్టుకుంటున్న యాంక‌ర్ ర‌వి ‘తోట‌బావి’ ఫ‌స్ట్ లుక్..

745
Thota Bavi Movie
- Advertisement -

యాంక‌ర్ ర‌వి హీరోగా గౌత‌మి హీరోయిన్‌గా గ‌ద్వాల్ కింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జోగులాంబ క్రియేష‌న్స్ ప‌తాకంపై అంజి దేవండ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం `తోట‌బావి`. దౌలు (విష్ణుప్రియ హోట‌ల్), చిన్న స్వామి,అభినేష్.బి స‌హ‌నిర్మాత‌లు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఈ రోజు శేఖ‌ర్ మాస్ట‌ర్ చేతుల మీదుగా విడుద‌లైంది.

నిర్మాత ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ మాట్లాడుతూ..“మా సినిమా ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేసిన డాన్స్ మాస్ట‌ర్ శేఖ‌ర్‌కి ప్ర‌త్యేక ధన్య‌వాదాలు. మా సినిమా టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మా ద‌ర్శ‌కుడు క‌థ‌, క‌థ‌నాలు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా త‌యారు చేశారు. అదే విధంగా తెర‌కెక్కించారు. ర‌వి స‌పోర్ట్ మ‌రువ‌లేనిది. త్వ‌ర‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ…“యాక్షన్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రం `తోట‌బావి`. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. హీరో ర‌వి ఇచ్చిన స‌పోర్ట్‌తో సినిమాను బాగా తీయ‌గ‌లిగాం. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా క్వాలిటీగా రావ‌డానికి స‌హ‌క‌రించారు“ అన్నారు.

Thota Bavi Movie First Look Launch

ఈ సంద‌ర్భంగా శేఖ‌ర్ మాస్ట‌ర్ మాట్లాడుతూ…“ తోట‌బావి` టైటిల్ చాలా కొత్త‌గా ఉంది. యాంక‌ర్ ర‌వి హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ బావుంది. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకరావాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

హీరోగా న‌టించిన యాంక‌ర్ ర‌వి మాట్లాడుతూ…“ టైటిల్ లాగే సినిమా అంతా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. డైర‌క్ట‌ర్ చెప్పిన‌దానికంటే కూడా అద్భుతంగా చిత్రీక‌రించారు. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు“ అన్నారు.

శివ‌శంక‌ర్ మాస్ట‌ర్, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్, న‌ర్సింహా రెడ్డి, జ‌బర్ద‌స్త్ అప్పారావు, జ‌బ‌ర్ద‌స్త్ రాజ‌మౌళి, రోహిణి, ఉన్నికృష్ణ‌, అభి, శివం త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః చిడ‌త‌ల న‌వీన్‌; ఎడిట‌ర్ః గిరి; స‌ంగీతంః దిలీప్ బండారి; స‌్టంట్స్ః శంక‌ర్‌; కొరియోగ్ర‌ఫీః స‌న్ని; లిరిక్స్ః రామాంజ‌నేయులు; స్టిల్స్ః పాండు రంగ‌; స‌హ‌నిర్మాత‌లుః దౌలు (విష్ణుప్రియ హోట‌ల్); చిన్న స్వామి; అభినేష్ .బి; నిర్మాతః ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్; క‌థ‌-స్క్రీన్ ప్లే -మాటలు-ద‌ర్శ‌క‌త్వంః అంజి దేవండ్ల‌.

- Advertisement -