నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ ఉంటారు. మొబైల్ చేతిలో లేనిదే రోజు గడవని పరిస్థితి. బ్యాంకింగ్ లావాదేవీలు, ఫోన్ సంభాషణలు, ఆఫీస్ పనులు, గేమ్స్ ఆడడం.. ఇలా నిత్యం వివిధ అవసరాల నిమిత్తం స్మార్ట్ ఫోన్ వాడుతూనే ఉంటాము. అయితే కొన్ని సందర్భాల్లో వివిధ వెబ్ సైట్స్ బ్రౌజింగ్ చేయడం వల్ల గానీ లేదా ఇతరత్రా అనౌన్ యాప్స్ ఇన్స్టాల్ చేయడం వల్లగాని, మొబైల్ హ్యాకింగ్ కు గురవుతుంది. తద్వారా మన పర్సనల్ డేటా హ్యాకర్స్ చేతికి చిక్కడం, మనకు తెలియకుండానే మన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకే మన మొబైల్ హ్యాకింగ్ కు బారిన పడిందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొబైల్ హ్యాకింగ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం..!
మొబైల్ హ్యాక్ అయితే.. విపరీతమైన యాడ్స్ వస్తుండడం గమనించవచ్చు. మనకు తెలియకుండానే యాప్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వడం, ఒకటి నొక్కితే మరోటి ఓపెన్ అవ్వడం.. ఇలాంటి సంకేతాలు కనిపించిన మొబైల్ హ్యాక్ అయిందని నిర్ధారించుకోవాలి. ఇంకా మొబైల్ విపరీతంగా వేడెక్కడం, డేటా త్వరగా అయిపోవడం, త్వరగా హ్యాంగ్ అవుతుండడం, ఇవన్నీ మొబైల్ హ్యాక్ అయిందని చెప్పడానికి సూచనలే అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇంకా గుర్తు తెలియని మెసేజ్ లు, కాల్స్, ఇతర అలెర్ట్ నోటిఫికేషన్స్ ఎక్కువగా రావడం వంటివి కూడా హ్యాకింగ్ కు సంకేతాలుగానే భావించాలి. ఇలాంటి సంకేతాలు మొబైల్ లో కనిపిస్తే వెంటనే మొబైల్ ను రీసెట్ చేసుకోవాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Also Read:Bigg Boss 7 Telugu:శివాజీ నట విశ్వరూపం