చాలమంది వ్యక్తిగతంగాను వృత్తి పరంగాను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమస్యలే వారిలో ఎన్నో ఆలోచనలకు కేంద్రం అవుతాయి. ఇలా విపరీతమైన ఆలోచనల వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది. దీనినే డిప్రెషన్ అని పిలుస్తారు. చాలా మంది మానసిక రుగ్మతలను తేలికగా తీసుకుంటూ ఉంటారు నిజానికి శారీరక సమస్యల కంటే మానసిక సమస్యలే మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలమందికి వారు డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు కూడా తెలియానంతగా సమస్య ద్వారా వేధింపబడుతుంటారు. కాబట్టి డిప్రెషన్ బారిన పడిన వారిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.
కొందరు విపరీతమైన ఆలోచనల కారణంగా రోజు దిగాలుగా కనిపిస్తూ కనిపిస్తూ ఉంటారు. నలుగురితో పాటు ఉండేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపరు. ఎక్కువ శాతం ఒంటరిగా గడిపేందుకే వారు ఇష్టపడుతుంటారు. అలాంటి వారిలో డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు గుర్తించాలి. ఇంకా ఆహారం సరిగా తినకపోవడం, బలహీన పడుతుండడం, ఏ పని చేయడానికి ఆసక్తి చూపకపోవడం, రాత్రిపూట సరిగా నిద్ర లేకపోవడం వంటివి కూడా డిప్రెషన్ లక్షణాలే. డిప్రెషన్ ఉన్నవారిలో మైగ్రేన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా గుండె సంబంధిత వ్యాధులు, ఛాతీలో నొప్పి రావడం, పొట్ట సంబంధిత వ్యాధులు కూడా డిప్రెషన్ కారణంగానే వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇంకా డిప్రెషన్ ఉన్నవారిలో మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. కాబట్టి డిప్రెషన్ ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయరాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్ బారి నుంచి బయట పడడానికి సరైన వైద్యంతో పాటు సరైన గైడెన్స్ కూడా ఎంతో ముఖ్యం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Also Read:TTD:సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు