కాలీఫ్లవర్ గురించి అందరికీ తెలిసిందే.. సీజన్ తో సంబంధం లేకుండా అన్నీ సీజన్లలో కూడా ఇది దొరుకుంటుంది. దీనితో వేపుడు, కర్రీ, వంటివి చేసుకొని ఆరగిస్తున్నారు. ఆరోగ్యపరంగా కూడా కాలీఫ్లవర్ తినడం ఎంతో మంచిది. ఇందులో వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయట. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణశయ సమస్యలు దరి చేరవు. ఇంకా ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయట. ఇందులో తక్కువ కెలోరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారు నిరభ్యంతరంగా కాలీఫ్లవర్ తినవచ్చు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ తినకపోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. .
ముఖ్యంగా హైపో థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ తినకపోవడమే మంచిది. ఎందుకంటే కాలీఫ్లవర్ తినడం వల్ల ఆయా హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా థైరాయిడ్ సమస్య రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. ఇంకా తరచూ గ్యాస్ తో ఇబ్బంది పడేవారు కూడా కాలీఫ్లవర్ కు దూరంగా ఉంటాయి. ఎందుకంటే అలాంటి వారికి ఇందులోని ఉండే పీచు పదార్థం ఎసిడిటీని పెంచుతుంది. ఇంకా చలికాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు కూడా కాలీఫ్లవర్ ను తినరాదు. కాలీఫ్లవర్ తిన్న తర్వాత కొందరిలో చర్మం దద్దుర్లు, దురద వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ సమస్యలు కనిపించినప్పుడు కాలీఫ్లవర్ కు దూరంగా ఉండాలి. కొందరిలో కాలీఫ్లవర్ అజీర్తిని కూడా కలుగజేస్తుంది. కాబట్టి ఆరోగ్య రీత్యా ఆయా సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్ కు దూరంగా ఉండడమే మేలని చెబుతున్నారు ఆహార నిపుణులు.
Also Read:దానిమ్మరసంతో ఆ సమస్యలు దూరం!