ఎన్నికల దండయాత్ర…ఏకంగా 92 సార్లు!

45
up

దండయాత్ర అనగానే టక్కున గుర్తుకు వచ్చేది మహమ్మద్ ఘోరీ. భారతదేశంపై ఏకంగా 18 సార్లు దండెత్తాడు. అయితే ఇదంతా గతం కానీ ఇప్పుడు మనం చదివే ఈ వ్యక్తి ఏకంగా 92 సార్లు దండయాత్ర చేశాడు. దండయాత్ర అంటే యుద్దం కాదు ఎన్నికల సంగ్రామంలో.

ఉత్తర ప్రదేశ్ లోని అగ్రాజిల్లా ఖైరాగఢ్ కు చెందిన అంబేడ్కరి హాసనురామ్ అనే వ్యక్తి 1985 నుంచి ఇప్పటివరకు తన దండయాత్ర చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు విజయం వరించలేదు. 1985లో తొలిసారిగా బిఎస్పీ నుంచి బరిలో దిగిన ఆయన ఓటమి పాలయ్యాడు. అప్పటి నుండి పట్టుదలతో ఎలాంటి ఎన్నికలు జరిగినా పోటీ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఏకంగా 92 సార్లు ఎన్నికల్లో పోటీ చేయగా అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం గ్రామ వార్డు మెంబెర్‌గా పోటీ చేస్తుండగా అదే వార్డు నుంచి ఆయన భార్య కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండటం విశేషం. మరీ ఈసారైన విజయం వరిస్తుందో లేదో చూడాలి..