ప్రశాంతమైన హైదరాబాద్‌ కోసం TRS ‌నే గెలిపించాలి- కేటీఆర్‌

133
ktr road show
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మూసాపేట్‌ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తూము శ్రావణ్ కుమార్‌కు మద్దతుగా శనివారరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. వరద సాయాన్ని ఆపిన బీజేపీ నేతలు రూ.25వేలు ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఇవ్వకుండా బీజేపీ నేతల్ని ఎవరు ఆపారు? టీఆర్‌ఎస్‌ రూ.10వేలు ఇస్తామంటే ఆపినవాళ్లు..ఇప్పుడు రూ.25వేలు ఇస్తారట అని కేటీఆర్‌ ఎద్దేవ చేశారు.

ఇది అమాయకపు అహ్మదాబాద్‌ కాదు..హుషార్‌ హైదరాబాద్‌. గత ఎన్నికల్లో ఒక్క సీటుతో మనం సెంచరీ కోల్పోయాం. ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ శతకం పూర్తి చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరినీ కలుపుకుని వెళ్తున్నారు. ప్రశాంతమైన హైదరాబాద్‌ కోసం టీఆర్‌ఎస్‌నే గెలిపించాలి. మీ కోసం పనిచేసే వారిని తిరిగి కార్పొరేషన్‌కు పంపించాలని’ కేటీఆర్‌ కోరారు. నగరంలో వరద బాధితులకు రూ.10వేలు ఇస్తుంటే మోకాలు అడ్డుపెట్టింది బీజేపీ, కాంగ్రెస్‌ కాదా..? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. అర్హులైన వారందరికీ వరద సాయం అందజేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -