కవి దేవిప్రియకు వినోద్ కుమార్ నివాళి..

25
vinod

అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ కవి, రచయిత, జర్నలిస్ట్ దేవిప్రియకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ నివాళులు అర్పించారు. శనివారం అల్వాల్ లోని దేవిప్రియ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయంపై పుష్ప గుచ్చాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సాహితీ, కళారంగానికి , జర్నలిజంలో దేవిప్రియ చేసిన సేవలను వినోద్ కుమార్ కొనియాడారు. ఈ సందర్భంగా దేవిప్రియ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

దేవిప్రియకు నివాళులు అర్పించిన వారిలో ప్రముఖ సంపాదకులు కే. రామచంద్రమూర్తి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రముఖ సాహితీవేత్తలు శివారెడ్డి, నందిని సిద్దారెడ్డి, నాలేశ్వరం శంకరం, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, సైదా రెడ్డి, సినీ దర్శకుడు బీ. నర్సింగరావు, టీ.యూ.డబ్ల్యు,జె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, తదితరులు ఉన్నారు.