రామ్ చరణ్, ఉపాసనలకు ఆడపిల్ల పుట్టిన విషయం తెలిసిందే. తమకు ఎంతో ఇష్టమైన మంగళవారం నాడు పాప పుట్టడం ఎంతో ఆనందకరంగా ఉందని, పాప మంచి ఘడియల్లో పుట్టిందని, పాప జాతకం కూడా అద్భుతంగా ఉంటుందన్నారని, ఆ ప్రభావం తమ కుటుంబంలో ముందు నుంచే కనపడుతుందని చిరూ చెప్పారు. చరణ్ కెరీర్ లో గ్రోత్, వరుణ్ ఎంగేజ్‌మెంట్ ఇలా అన్నీ తమ ఫ్యామిలీలో శుభాలే జరుగుతున్నాయని.. ఇదంతా మా పాప రాక ప్రభావమే అని మెగాస్టార్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇంతకీ, మెగా ప్రిన్సెస్ పుట్టిన టైం ఏదో తెలుసా?, మెగా ప్రిన్సెస్ మంగళవారం తెల్లవారుజామున 1:49 నిమిషాలకు పుట్టిందట. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేకమైన మెడికల్ టీమ్ ఉపాసనకు ప్రసవం చేసింది. మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు.. పాప మంచి ఘడియల్లో ప్రసవం జరిగిందని మెగా కుటుంబానికి ఎంతో మేలు చేకూరుతుందని పురోహితులు కూడా అంటున్నారు. అలాగే పాప శుభదాయకమైన మంగళవారం పుట్టడం కూడా గొప్ప విశేషంగా చెబుతున్నారు.
Also Read: Karthikeya: మను చరిత్ర గ్రాండ్ సక్సెస్
ఇక చిన్నారి పోలికలు ఎలా ఉన్నాయో అని మీడియా మెగాస్టార్ ని అడిగింది. అయితే, ఎవరి పోలికలు వచ్చాయో.. ఇప్పుడే చెప్పలేమని చిరు తెలిపారు. మొత్తమ్మీద మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడో తరం అడుగుపెట్టింది. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. ‘లిటిల్ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం ! నీ రాకతో కోట్లాది మంది మెగా ఫ్యామిలీతో పాటు మా అందరికి ఆనందాన్ని పంచావ్. రామ్ చరణ్, ఉపాసనలను తల్లిదండ్రులను చేశావు. మమ్మల్ని గ్రాండ్ పేరంట్స్‌ను చేశావు. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని రాసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: ‘గుంటూరు కారం’లో అక్కడే తేడా