సమంతతో లైఫ్‌లాంగ్‌… కాంట్రవర్శీ వద్దు..

171
This director wants to work with Samantha for life
- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్‌ సమంతని హాఫ్‌స్ర్కీన్‌ కమెడియన్‌ అని కూడా అంటుంటారు తనని ఎక్కువగా ఇష్టపడేవారు. ఎందుకంటే సామ్‌ ఇచ్చే ఇంటర్వూలు చూస్తే ఎవ్వరికైనా ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అయితే ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే..అంకితభావం విషయంలో సామ్ ది బెస్ట్‌ అంటుంటారు హీరోలు. ఇప్పుడీ లిస్ట్‌ లో రామ్‌ చరణ్ కూడా చేరిపోయాడు.

 This director wants to work with Samantha for life

మామూలుగానే సమంత ఎంతటివారినైనా అట్రాక్ట్‌ చెయ్యవడంలో దిట్ట. ఇక సినిమాల విషయానికొస్తే..సీన్‌ బాగా రావడం కోసం ఎంతకష్టమైనా చెయ్యడానికి రెడీగానే ఉంటుంది. ఈ విషయాన్ని చాలా మంది హీరోలు చెప్పారు కూడా. తాజాగా రంగస్థలం సినిమా విషయంలో సామ్‌ కమిట్‌మెంట్స్‌కి అట్రాక్ట్‌ అయ్యాడు చెర్రి. అందుకే సమంత పక్కనుంటే ఓ నటుడికి మంచి సపోర్టు దొరుకుతుంది అంటున్నాడు.

”ఈ పదేళ్లలో ఎన్నో సినిమాలు చేశాను. కానీ ఈ సినిమాలో మాత్రం సమంతతో చేసినప్పుడు చాలా ఎనర్జీ వచ్చింది. మనపై మనకు ఓ నమ్మకం కలిగిస్తుంది సమంత. ఓ మంచి కో-స్టార్ దొరికితే ఏ నటుడికైనా బాగా నటించడానికి అవకాశం దొరుకుతుంది. రంగస్థలంలో ప్రతి సీన్ ఇంత అందంగా రావడానికి సమంత కూడా కారణం.”సమంతతో ఫస్ట్ టైం రంగస్థలంలో నటించిన చరణ్, ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆమెను ఇలా ఆకాశానికెత్తేశాడు.

ఇక దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ…సమంతతో జీవితాంతం సినిమాలు చెయ్యాలని ఉందంటూ ప్రకటించాడు. తన స్టేట్‌మెంట్‌ను కాంట్రవర్శిగా తీసుకోవద్దని, చైతూతో సమంత జీవితాంతం ఎలాగైతే ఉంటుందో అలా..తనకు కూడా సమంతతో జీవితాంతం సినిమాలు చెయ్యాలని ఉందని తెలిపాడు. అంతేకాదు .. సమంతకు 30 ఏళ్ళు వస్తే అలాంటి పాత్రే చేస్తానని, 40 ఏళ్ళు వస్తే ఆ టైపు క్యారెర్టరే చేయాలనుందని చెప్పుకొచ్చాడు. సుకుమార్‌ని అంతలా ఇంప్రెస్‌ చేసిందటి సమంత.

- Advertisement -