గోపిచంద్.. పంతం ఫస్ట్ లుక్‌!

243
Gopichand pantham firstlook on March 22nd
- Advertisement -

విలన్‌గా కెరీర్ ప్రారంభించి హీరోగా దూసుకెళ్తున్న నటుడు గోపిచంద్. ఆక్సిజన్‌తో హిట్ కొట్టిన గోపిచంద్ ప్రస్తుతం తన 25వ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై చేస్తున్నాడు. కె చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పంతం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మే 18న సినిమా విడుదల కానుండగా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 22(మార్చి 22)న విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది.

 Gopichand pantham firstlook on March 22nd

22న ఉదయం 10 గంటలకు ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. మంచి మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమా తెర‌కెక్కుతుండగా గోపిచంద్ ఎందుకోసం పంతం ప‌ట్టాడు, ఆ కార‌ణాలేంటి అనేవి సినిమాలో చ‌క్క‌గా చూపిస్తామ‌ని నిర్మాత స్ప‌ష్టం చేశాడు. గోపీచంద్‌ సరసన మెహ‌రీన్ హీరోయిన్‌గా సటిస్తుండగా‌ పృథ్వీ, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

gopichand

- Advertisement -