- Advertisement -
కరోనా థర్డ్ వేవ్ కేరళను అతలాకుతలం చేస్తోంది. వరుసగా మూడో రోజు 30 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 32,801 కేసులు నమోదుకాగా పాజిటివిటీ రేటు ఏకంగా 19.22 శాతం పెరిగింది.శుక్రవారం దేశంలో 44,658 కరోనా కేసులు నమోదుకాగా అందులో 33 వేల వరకు కేరళలోనే ఉండటం విశేషం.
ఇటీవల బక్రీద్, ఓనం వంటి పలు పండుగలు జరిగిన నేపథ్యంలో ప్రజలు గుంపులుగా చేరడం వల్ల కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,26,03,188కు చేరగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,44,899కు చేరింది. కరోనాతో దేశంలో ఇప్పటివరకు 4,36,861 మంది మృతిచెందారు.
- Advertisement -