దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అనివార్యం- ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియా

129
AIIMS Chief
- Advertisement -

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అనివార్యమని, రాబోయే 6 నుంచి 8 వారాల్లో సంక్రమణ ప్రారంభం అయ్యే అవకాశాలు న్నాయని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. కరోనా మూడో వేవ్‌ కొన్ని నెలల్లో రావచ్చని అనేకమంది నిపుణులు హెచ్చరించిన పరిస్థితుల్లో గులేరియా అప్రమత్తంచేయడం గమనార్హం.

‘కరోనా కేసులు తగ్గడంతో దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైంది. దీంతో ప్రజలు బయటికి రావడం, కోవిడ్‌ నిబంధనలను పాటించకపోవడం, ఒకే దగ్గర గుమిగూడడం, సామాజిక దూరాన్ని పాటించకపోవడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్‌ వేవ్స్‌ నుంచి ప్రజలు ఏమీ నేర్చుకున్నట్లు లేదు’ అని ఆయన అన్నారు. ప్రజలు కోవిడ్‌ నిబంధనలను పాటించడం, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడ కుండా ఉండటం లాంటి జాగ్రత్తలను ఏమేరకు అవ లంభిస్తారనే దానిపై థర్డ్‌ వేవ్‌ రాక ఆధారపడి ఉంటుందని గులేరియా వ్యాఖ్యానించారు.

కరోనా కొత్త వేవ్‌ ప్రభావం మొదలుకావడానికి సాధారణంగా మూడు నెలలు పడుతుంది. కానీ వివిధ అంశాల ప్రభావంతో తక్కువ సమయంలో దాని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు కోవిడ్‌ నిబంధనలను పాటించాలి. బయటి వేరియంట్‌ భారత్‌లో వ్యాప్తి చెంది పరివర్తన చెందింది. అందుకే కరోనా హాట్‌స్పాట్‌లపై నిఘా పెంచాలి. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోస్‌ల మధ్య అంతరాల పెరుగుదల తప్పేం కాదు. కరోనాను ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అనుసరించాలి’

- Advertisement -