డైరెక్ట‌ర్ పూరీతో తిమ్మ‌రుసు టీజ‌ర్‌..

321
Thimmarusu
- Advertisement -

టాలీవుడ్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ న‌టిస్తోన్న తాజా చిత్రం తిమ్మ‌రుసు. మ‌హేశ్‌కోనేరు-సృజ‌న్ య‌ర‌బోలు సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌స్తోంది. డిసెంబ‌ర్ 9న తిమ్మ‌రుసు టీజ‌ర్ ను డిసెంబ‌ర్ 9న‌ లాంఛ్ చేస్తున్న‌ట్టు ఈ సంద‌ర్బంగా చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది.

టాలీవుడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ రేపు సాయంత్రం 5 గంట‌ల‌కు టీజ‌ర్‌ను లాంఛ్ చేయ‌నున్నాడు. నిఖిల్ సిద్దార్థ్ తో కిర్రాక్ పార్టీ వంటి హిట్ సినిమా తీసిన డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్ కొప్పిసెట్టి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. విభిన్న క‌థాంశాల‌తో కూడిన చిత్రాల్లో న‌టించిన‌ స‌త్య‌దేవ్..గుర్తుందా సీతాకాలం అనే సినిమా కూడా చేస్తున్నాడు.

- Advertisement -