సాధారణంగా ఏ దొంగైనా.. దొంగతనం చేసిన సొత్తును ఎత్తుకెళ్తాడు. కానీ ఇక్కడ రివర్స్. దొంగతనం చేసిన సొత్తును మొత్తాన్ని తిరిగిచ్చేశాడు. ఇంత మంచి దొంగత ఎవరబ్బా అనుకుంటున్నారా? మధ్యప్రదేశ్ బాలాఘాట్ లోని జైన మందిరంలో చోరీకి పాల్పడిన దొంగ ఇలాంటి పనే చేశాడు.
గుడిలో దొంగతనం చేసిన రూ.లక్షలు విలువ చేసే వస్తువులను తిరిగి ఇచ్చేశాడు 9 వెండి గొడుగులు, ఒక వెండి జాడీ, 3 ఇత్తడి పాత్రలు ఎత్తుకెళ్లాడు. చోరికి లగ్జరీ కారులో వచ్చిన దొంగ.. హనుమాన్ భక్తుడు. ముందుగా చెప్పులు విడిచి చేతులు జోడించి దేవున్ని వేడుకున్న.. దొంగ అనంతరం వస్తువులను ఎత్తుకెళ్లాడు. దొంగ.. తన మనసు మార్చుకొని అపహరించిన వస్తువులను తిరిగి ఇచ్చేశాడు. చోరీ చేసిన వస్తువులను ఓ సంచిలో ఉంచి గ్రామ పంచాయతీ వద్ద వదిలేసి వెళ్లాడు. మనసు మార్చుకొని లేఖ రాసిన దొంగ.. క్షమించమని ప్రార్థించాడు. ఈ దొంగతనం చేయడం వల్ల చాలా బాధపడ్డట్టు లేఖలో పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి