వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

70
- Advertisement -

వర్షాకాలంలో వాతావరణం చల్లబడటం కారణంగా పలు రకాల బ్యాక్టీరియా, వైరస్ లు, ఫ్లూ కు సంబంధించిన క్రిములు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే మిగిలిన కాలాలతో పోల్చితే వర్షాకాలంలో చాలా త్వరగా వ్యాధుల బారిన పడుతూ ఉంటాము. ఇక వర్షాకాలం లో తరచూ వేధించే సమస్యలు చాలానే ఉంటాయి. కాబట్టి ఈ మాన్ సూన్ సీజన్ లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలే. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ వర్షాకాలంలో తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. కాబట్టి వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

మన శరీరానికి అవసరమైన విటమిన్స్ లో డి విటమిన్ పాత్ర అధికంగా ఉంటుంది. ఇది సాధారణంగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అయితే వర్షాకాలంలో మబ్బుల కారణంగా సూర్యరశ్మి బయటకు రాదు. అలాంటప్పుడు మన శరీరంలో డి విటమిన్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది. డి విటమిన్ లోపం కారణంగా ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతాయి. కాబట్టి సూర్యరశ్మికి ప్రత్యామ్నాయంగా డి విటమిన్ లభించే ఆహార పదార్థాలు అనగా చేపలు, గుడ్డు, పుట్ట గొడుగులు, చీజ్ వంటివి మన డైలీ ఆహార డైట్ లో చేర్చుకోవాలి.

దోమల నుంచి రక్షణ
వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద అధికంగా ఉంటుంది. ఎన్నో రోగాలకు దోమలే మూలకారణం.. దోమలను నియంత్రించేందుకు ఇల్లు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం, ఇంట్లో చెత్తను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం, ఆరు బయట నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవడం వంటివి చేయాలి. ఇంట్లోకి దోమలు బొద్దింకలు, క్రిమికీటకాలు చేరకుండా క్రిమిసంహారక స్ప్రేలు చేయడం, ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూసుకోవాలి.

ఆహారం విషయంలో జాగ్రత్త
వర్షాకాలంలో మనం తినే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా నిల్వ ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఆహారాన్ని ఎప్పటికప్పుడు వేడిగానే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:కోలీవుడ్ టార్గెట్‌గా పవన్‌ వ్యాఖ్యలు!

సీజనల్ అలెర్జీలకు దూరం
వాతావరణంలో మార్పుల కారణంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. మరి ముఖ్యంగా ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఈ సీజనల్ వ్యాధులు మరింత ఇబ్బందిగా మారుతుంటాయి. అందుకే సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్స్, ఆకు కూరలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

Also Read: కార్గిల్ విజయ్ దివస్..వీర జవాన్ల యాదిలో

ఇలా వర్షాకాలంలో తగు జాగ్రత్తలు పాటించడం వల్ల సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంతో పాటు కొత్త వ్యాధులు దారి చేరకుండా చూసుకోవచ్చు.

- Advertisement -