వీటిని తింటే..లివర్ సమస్యలకు చెక్!

119
- Advertisement -

నేటి రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలలో లివర్ ప్రాబ్లమ్స్ కూడా ఒకటి. పొగ త్రాగడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్ల కారణంగా లివర్ చెడిపోయి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. రోజు మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా శరీరంలో పెరుకుపోయిన విష పదార్థాలను, వ్యర్థాలను లివర్ బయటకు పంపిస్తుంది. మరి అలాంటి లివర్ ను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి.. మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించే క్రమంలో లివర్ కొన్ని రకాల ప్రీ ర్యాడికల్స్ ను విడుదల చేస్తుంది. ఈ ప్రీ ర్యాడికల్స్ అనేవి లివర్ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. అయితే ప్రీ ర్యాడికల్స్ ను ఎదుర్కోవాలంటే లివర్ కు సరైన పోషకాలు, యాంటీ యాక్సిడెంట్లు ఎంతో అవసరం. మనం రోజు తీసుకునే ఆహారంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను జత చేసుకోవడం వల్ల లివర్ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

​మాంసకృత్తులు సమృద్దిగా ఉన్న చేపలు, కోడిగుడ్లు తినడం వల్ల లివర్ ఆరోగ్యానికి కావల్సిన ఒమేగా 3, ఒమేగా 6 వంటి యాసిడ్లు లభిస్తాయి. ఇవి లివర్ లోని పెరుకుపోయిన కొవ్వును కరిగించి లివర్ ను శుభ్రపరుస్తాయి. అందువల్ల ప్రతిరోజూ మనం తినే ఆహారంలో గుడ్డు ఉండేలా చూసుకోవాలి. ఇక వారంలో రెండు నుంచి మూడు సార్లు చేపలు తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ద్రాక్ష కూడా లివర్ ను శుభ్రం చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ లోని వ్యర్థాలను బయటకు పంపించి లివర్ పనితీరును మెరుగుపరుచుతాయి.

ఇక బాదం, పిస్తా, వాల్ నాట్స్ వంటివి కూడా లివర్ పని తీరును మెరుగు పరచడంలో ఎంతగానో ఉపయోగ పడతాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ వంటి పోషకాలు.. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు చెక్ పెడతాయని పలు అద్యయానాలు చెబుతున్నాయి. అందువల్ల ప్రతిరోజూ ఒక గుప్పెడు వాల్ నాట్స్ తినడం లివర్ కు ఎంతో మంచిదట. ఇక ఇవే కాకుండా ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల ప్రతిరోజూ 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు, 50 గ్రాముల ఉల్లిపాయ గడ్డ కచ్చ పచ్చిగా తినడం ద్వారా ప్లేవనాయిడ్లు అనే యాంటీ యాక్సిడెంట్లు మన శరీరానికి అంది లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

- Advertisement -