కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత..

15
- Advertisement -

కేంద్రమాజీ మంత్రి,బీజేపీ నేత శ్రీనివాస ప్రసాద్ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.చామరాజనగర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

చామరాజనగర్‌ నియోజకవర్గం నుంచి శ్రీనివాస ప్రసాద్ ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. మైసూరు జిల్లాలోని నంజన్‌గుడ్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

బీజేపీలో చేరడానికి ముందు కొంతకాలం పాటు జేడీయూ, జేడీఎస్, సమతా పార్టీల్లో కూడా పనిచేశారు. 1999 -2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయూ ప్రధానిగా ఉన్న సమయంలో శ్రీనివాస ప్రసాద్.. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2013లో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత 2016లో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.

Also Read:డయాబెటిస్ ఉన్నవాళ్ళు వీటిని తింటే డేంజర్!

- Advertisement -