దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఇంటర్వ్యూ చేశారు సంగీత దర్శకుడు కీరవాణి.
ఇక కీరవాణి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు రామ్ చరణ్ – ఎన్టీఆర్. ఇప్పటి జనరేషన్ సింగర్స్‌లో మీకు నచ్చిన వారు ఎవరని అడగ్గా… చరణ్ మాట్లాడుతూ…..బుల్లెట్ బండి పాట పాడిన మొహనభోగరాజు , సారంగదరియా పాడిన మంగ్లీ గారి వాయిస్ లు బాగుంటాయి. వారిద్దరూ తనఫేవరెట్ సింగర్స్ అని తెలిపారు.
ఇక ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో ‘రెడ్డమ్మతల్లి’ పాట పాడిన మోహనభోగరాజు, జై బాలయ్య పాడిన గీతామాధురి వాయిస్ లు బాగుంటాయన్నారు. వారి పాటలు బాగుంటాయి. వాళ్లిద్దరూ ఇష్టమైన సింగర్స్ అని తెలపగా ఈ మాటలని షేర్ చేసిన మోహన్ భోగరాజు, గీతా మాధురి, మంగ్లీలు వారికి థ్యాంక్స్ చెప్పారు.