దీపికా గ్లామర్ సీక్రెట్స్ ఇవే

39
- Advertisement -

దీపికా పడుకోణె వయసు 37 సంవత్సరాలు. అయినా, ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదు. పైగా వయసు పెరిగే కొద్దీ.. దీపికా గ్లామర్ రెట్టింపు అవుతూ ఉంది. ఇంతకీ, దీపికా పడుకోణె అందం వెనుక ఉన్న సీక్రెట్ తెలుసుకోవాలని ఉందా ?, అసలు, తన అందం కాపాడుకోవడం కోసం ‘దీపికా పడుకోణె’ ఏమి చేస్తోంది ?, దీపికా పడుకోణె చాలానే చేస్తోంది. ఎప్పుడూ హస్కీ లుక్స్ లో డస్కీ బ్యూటీగా కనిపించే ‘దీపికా పడుకోణె’ తన అందాన్ని కాపాడుకోవడానికి చాలా చేస్తాను అంటుంది. ‘దీపికా పడుకోణె’ అందం వెనుక ఉన్న బ్యూటీ సీక్రెట్స్, ఆమె ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఏమిటో చూద్దాం.

1. దీపికా పడుకోణె డైట్ :
‘దీపికా పడుకోణె’కి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం. కానీ, ఆమె వెజిటేరియన్ డైట్ ను ఎక్కువగా ఫాలో అవుతుంది. అలాగే, తన భోజనంలో ఎప్పుడూ రసం ఉండేలా చూసుకుంటుంది. రసం తన శరీరాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుతుందని ‘దీపికా పడుకోణె’ అభిప్రాయం. వేపుళ్ళు, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఎంతో ఇష్టం ఉన్నా.. తన అందమైన శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడం కోసం దీపికా పడుకోణె వాటికి చాలా దూరంగా ఉంటుంది.

2. తాజా చర్మం కోసం ‘దీపికా పడుకోణె’ ఏమి చేస్తోందో తెలుసా ?
‘దీపికా పడుకోణె’ తరచూ మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు తీసుకుంటుంది. వీటి వల్ల తన చర్మానికి తగినంత తేమ అందుతుందని, అప్పుడు తన స్కిన్ నిత్యం తాజాగా కనిపిస్తుందని ‘దీపికా పడుకోణె’ చెబుతుంది.

3. ఫేస్ పై మచ్చలు రాకుండా ఉండటం ‘దీపికా పడుకోణె’ ఏమి చేస్తోంది అంటే ?
‘దీపికా పడుకోణె’ ప్రతి రోజూ ఉదయం.. ఐస్ క్యూబ్స్ తో తన ముఖాన్ని మర్దన చేస్తోంది. ఇక షూటింగ్ లేకపోతే అస్సలు మేకప్ జోలికే వెళ్ళదు. పైగా హాని కలిగించే రసాయనాలతో ఉన్న మేకప్ ను, అలాగే రకరకాల హెయిర్ స్టైల్స్ కాకుండా ఎప్పుడూ సింపుల్ గా ఉండటానికే ‘దీపికా పడుకోణె’ ఇష్టపడుతుంది.

4. ‘దీపికా పడుకోణె’ వాటికీ పూర్తి దూరం.
స్వీట్స్ ను అమితంగా ఇష్టపడే ‘దీపికా పడుకోణె’ వాటికి మాత్రం చాలా దూరంగా ఉంటుంది. అలాగే.. ఆమె బయట ఫుడ్ ను కూడా బాగా ఇష్టపడుతుంది. ఐతే.. తన కొత్త డైట్ కారణంగా ఆమె ప్రస్తుతం అవుట్ సైడ్ ఫుడ్ కి కూడా పూర్తి దూరంగా ఉంటుంది.

Also Read: Adhah Sharma:బర్త్‌డే స్పెషల్

5. అందమైన ఫిజిక్ కోసం దీపికా పడుకోణె చేసేది ఇదే :
‘దీపికా పడుకోణె’ జిమ్ లో డైలీ గంట సేపు గడుపుతుంది. నిపుణుడైన ట్రైనర్ పర్యవేక్షణలో ఆబ్ క్రంచెస్, కార్డియో, వెయిట్స్ మరియు ఫ్రీ హాండ్ వంటి వ్యాయామాలను ‘దీపికా పడుకోణె’ క్రమం తప్పకుండా చేస్తోంది. అందుకే ‘దీపికా పడుకోణె’ ఎప్పుడు చాలా పర్ఫెక్ట్ ఫిజిక్ తో కనిపిస్తోంది.

Also Read: Raj Tharun:హ్యాపీ బర్త్ డే

- Advertisement -