నెంబర్ వన్ దిశగా కృతి సనన్

51
- Advertisement -

నెంబర్ వన్ పొజిషన్ కోసం ఎవరైనా పరితపిస్తారు. కానీ ఆ స్థాయికి చేరుకోవాలంటే.. టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి. మరి ఇండియాలో రానున్న నాలుగైదు ఏళ్ళల్లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎవరు ఉంటారు ?, ఏ హీరోయిన్ కి ఆ లక్ ఉంది ?, ఇప్పడున్న పరిస్థితుల్లో ఎటువంటి సంకోచం లేకుండా కృతి సనన్ పేరు చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె సినిమాల లైనప్ మామూలుగా లేదు. కృతి సనన్ కి దరిదాపుల్లో మరో భామ కనపడటం లేదు. పైగా కృతి సనన్ ఇంకా పాతికేళ్ల ఫిజిక్ తోనే పర్ఫెక్ట్ గా బాడీని మెయింటైన్ చేస్తోంది. దీనికితోడు ఆమె వయసు కూడా 32కి తక్కువే. కాబట్టి మరో ఐదేళ్లు పాటు కృతి సనన్ కి ఛాన్స్ ఉంది.

దీనికితోడు, దీపికా పదుకోణే, అలియా భట్, కియారా అద్వానీ వంటి భామలందరూ పెళ్లి చేసుకుని.. నెంబర్ వన్ రేసులో నుంచి దూరం జరిగారు. ప్రస్తుతానికి యంగ్ హీరోయిన్స్ లో కృతి సనన్ మాత్రమే లీడింగ్ లో ఉంది. నటన పరంగా చూసుకున్నా.. కృతి సనన్ కి ఫుల్ మార్క్స్ పడతాయి. అలాగే భారీ ఆఫర్లతో తన కెరీర్ లో కృతి సనన్ దూసుకుపోతుంది. దీనికితోడు, కృతి సనన్ పారితోషికం కూడా కళ్ళు చెదిరేలా ఉన్నాయి. ఇంతవరకు ఒక్క సాలిడ్ హిట్ కూడా రాకుండానే కృతి సనన్ అక్షరాలా సినిమాకి 5 నుంచి 6 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Also Read: Adhah Sharma:బర్త్‌డే స్పెషల్

ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు కృతి సనన్ 6 కోట్లు తీసుకొంది. ఇక తాజాగా రణ్ బీర్ కపూర్ కొత్త సినిమాలో నటించేందుకు ఏకంగా 8 కోట్లు డిమాండ్ చేసిందట. దానికి నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు. అంటే కృతి సనన్ పారితోషికం ఇప్పుడు పెద్ద హీరోయిన్ల కంటే ఎక్కువ ఉన్నట్లే. పైగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా కృతి సనన్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమా కూడా కృతి సనన్ చేస్తే.. ఇక ఆమె రేంజ్ ను మరో హీరోయిన్ ఇప్పట్లో అందుకోవడం కష్టమే.

Also Read: దీపికా గ్లామర్ సీక్రెట్స్ ఇవే

- Advertisement -