- Advertisement -
వరుస ఫ్లాపులతో రవితేజ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటికే ఈ హీరో సినిమా వచ్చి ఏడాది కావస్తోంది. దీంతో రవితేజ ఆరోగ్యం వియయంలో, సినిమా విషయంలో రకరకాల పుకార్లు షికారు చేశాయి. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ రవితేజ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాబోయే కొత్త సినిమాలో సరికొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు రవితేజ.
తన ఫిజిక్ మరింత అట్రాక్టివ్ గా కనిపించేందుకు త్వరలోనే ఫారిన్ లో ట్రీట్ మెంట్ తీసుకోబోతున్నాడు. ఇందుకోసం రిజువినేషన్ థెరపీ చేయించుకోవడానికి రవితేజ డిసైడయ్యాడని సమాచారం. ట్రీట్మెంట్ తరువాత రైటర్ విక్రమ్ సిరితో రవితేజ సినిమా చేయబోతున్నట్లు టీటౌన్ వార్తలు వినిపిస్తున్నాయి.
- Advertisement -