లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన రవితేజ…

283
online news portal
- Advertisement -

మాస్‌ మహరాజా రవితేజ గురించి మనం చెప్పనకర్లేదు ఇడియట్‌, విక్రమార్కుడు, వెంకీ, భద్ర, నా ఆటోగ్రాఫ్‌, ఆంజనేయులు, అమ్మనాన్న ఓతమిళ అమ్మాయి లాంటి సినిమాలతో మంచి హిట్‌ అందుకున్న రవితేజకు ప్రస్తుతం సినిమాలు లేవు ఉన్నా అవి ప్లాప్‌లుగా నిలుస్తున్నాయి.

రవితేజ బెంగాల్‌ టైగార్‌ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. రెండు మూడు సినిమాలు ఓకే అయినప్పటికి అవి సెట్స్‌పైకి వెళ్లలేదు. నిర్మాతతో ఇబ్బందుల వల్ల చాలా సినిమాలు మిస్‌ చేసుకున్నట్లు మాస్‌మహరాజాపై ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Online news portal

అయితే,.. ఈ వార్తలన్నిటిని ఖండిస్తూ ప్రేమమ్‌ డైరెక్టర్‌తో రవితేజ సినిమా చేస్తున్నాడట. ఇటీవలే ప్రేమమ్‌ రీమేక్ తో సూపర్ హిట్ అందుకున్న చందు మొండేటికి రవితేజతో ఆఫర్ రావడం లక్కీ అనే చెప్పాలి. నాగచైతన్యతో సినిమా హిట్‌ కావడంతో చందుకి ఈ క్రేజీ ఆఫర్‌ను తీసుకొచ్చిందట. ప్రేమమ్‌ రీమేక్‌ తీసి తెలుగులో తన ప్రతి కనబరిచాడు చందు. కార్తికేయ సినిమాతో దర్శకుడిగా పరిచయమై చందు మొండేటి ఆ తర్వాత ప్రేమమ్‌తో కూడా సూపర్‌ హిట్‌ అందుకున్నారు. తన దగ్గర అదిరిపోయే కథలున్నాయని ప్రేమమ్‌ ప్రమోషన్స్ లో చెప్పిన ఆయన ఈ మధ్యనే రవితేజకు ఓ లైన్ కూడా వినిపించగా ఇంప్రెస్ అయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని కుదిరితే ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని ఫిల్మ్‌నగర్‌ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవర్ సినిమాతో దర్శకుడిగా అవకాశాన్ని ఇచ్చిన బాబి డైరక్షన్లో ఈ మధ్యనే ఓ సినిమా ప్లాన్ చేసినా అది అటకెక్కడంతో ఈసారి పక్కా ప్రణాళికతో వస్తున్నాడు రవితేజ.

online news portal

రవితేజతో సినిమా అంటే స్టార్ డైరక్టర్ అవకాశం వచ్చినట్టే. కనుక చందు అదిరిపోయే రిజల్ట్ తీసుకొస్తే ఇక స్టార్ డైరక్టర్ అయినట్టే. రవితేజతో లక్కీ ఛాన్స్ అందుకున్న చందు ఓ డిఫరెంట్ ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది. కుర్ర దర్శకులతో ప్రయోగం చేస్తున్న రవితేజ ఈ సక్సెస్ తో మళ్లీ ట్రాక్ ఎక్కేయాలని చూస్తున్నాడు. సంవత్సరం పాటు ఏ సినిమా చేయకుండా ఉన్న రవితేజ ఇకనుండి వరుస సినిమాలు చేయాలనే ప్లాన్లో ఉన్నాడట.

- Advertisement -