బండి పోయినా ప్రాణం మిగిలింది..

601
- Advertisement -

వారంరోజులుగా తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు. రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదవుతుండటంతో వాగులు, పొంగుతుండగా, చెరువులు, కుంటలు మత్తడిపోస్తున్నాయి. భారీ వర్షాలకు చెరువులకు గండ్లుపడటంతో నీరంతా వృథాగా పోతున్నది. పట్టణ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో మూడురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.

ఇక జంటనగరాలలో గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. భారీ వర్షాల కారణంగా నాలాలో నుంచి వర్షం నీరు పొంగి పారుతోంది. దీంతో రాకపోకలకు బాగా ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఆఫీసులకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెరచి ఉన్న మ్యాన్ హోల్ లు సైతం మృత్యుకుపాలుగా మారుతున్నాయి. ఓ వ్యక్తి రోడ్డుపై బైక్‌ పై వెళుతుండగా..ప్రమాద వశాత్తు మ్యాన్ హోల్ లో పడ్డాడు. అదృష్టవశాత్తు అతను బయటపడ్డ బండి మాత్రం నాలాలో కొట్టుకపోయింది. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. మరికొన్ని చోట్ల ఇలాంటి సంఘటనలే జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు దర్శనమిస్తున్నాయి.

rain

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం, మ్యాన్‌హోళ్లతో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో వాటర్‌బోర్డు ఒక ఎమర్జెన్సీ సెల్‌ను ఏర్పాటుచేసింది. ఈ ఎమర్జెన్సీ సెల్ ఫోన్ నెంబరు.. 99899 96948. వర్షాల కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా ఈ నెంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని అధికారులు చెబుతున్నారు. ఇక వరదనష్టంపై అంచనా వేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.

rain hyderabad

వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి కేటీఆర్ పరిశీలిస్తున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద పరిస్థితిని మంత్రి సమీక్షించారు. అక్కడి నుంచి అల్వాల్ వెళ్లిన మంత్రి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అల్వాల్, మోత్కుంట, కొత్త చెరువులు, నాలాలను మంత్రి పరిశీలించారు.హైదరాబాద్ నగరంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని… ఎలాంటి వదంతులు, దుష్ప్రచారాలను నమ్మొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -