విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ ట్రైలర్

121
- Advertisement -

హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.

చిత్ర సమర్పకుడు రవితేజ, రానా దగ్గుబాటి కలిసి ‘మట్టి కుస్తీ తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఈ చిత్రం డ్రామా, రొమాన్స్, వినోదం, యాక్షన్‌తో కూడిన కంప్లీట్ ప్యాకేజీ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్ సినిమా కథాంశాన్ని ఆసక్తి కరంగా ప్రజంట్ చేసింది,

అణిగిమణిగి వుండే భార్య కావాలని కోరుకునే కబడ్డీ ప్లేయర్ విష్ణు విశాల్. మరోవైపు, ఐశ్వర్య లక్ష్మి దూకుడు గల అమ్మాయి. గ్రామంలో అనవసరమైన గొడవల్లో తలదూర్చుతుంది. ఇలా అయితే పెళ్లి సంబంధాలు రావడం కష్టం కాబట్టి ఆమెను అనుకువగా ఉండమని ఒత్తిడి చేస్తారు తల్లితండ్రులు. అలా విష్ణు, ఐశ్వర్య లక్ష్మి ల వివాహం జరుగుతుంది. కానీ వారి దూకుడు స్వభావాల కారణంగా వారి మధ్య స్పర్ధలు వస్తాయి.

ట్రైలర్ చాలా ప్రామెసింగ్ ఉంటూ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. విష్ణు విశాల్ తన పాత్రలో అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశాడు. విష్ణు చేసిన యాక్షన్ స్టంట్స్ మైండ్ బ్లోయింగా వున్నాయి. ఐశ్వర్య లక్ష్మి దూకుడు గల అమ్మాయిగా విలక్షణమైన పాత్రలో సర్ ప్రైజ్ చేసింది. ట్రైలర్ కు జస్టిన్ ప్రభాకరన్ అందించిన నేపధ్య సంగీతం బ్రిలియంట్ గా వుంది. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫి అత్యున్నతంగా వుంది. ఈ చిత్రానికి ఎడిటర్ గా ప్రసన్న జికె పని చేస్తున్నారు. మట్టి కుస్తీ’ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -