ఈ లక్షణాలు ఉంటే..కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లే!

70
- Advertisement -

నేటిరోజుల్లో చాలమంది కిడ్నీ వ్యాధులతో బాధ పడుతూ ఉంటారు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి రక్తాన్ని శుద్ది చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి కిడ్నీల పనితీరు మందగిస్తే ప్రమాదంలో పడినట్లే. కిడ్నీ వ్యాధులలో ప్రధానంగా చాలమంది ఎదుర్కొనే సమస్య వాటిలో రాళ్ళు ఏర్పడడం. కిడ్నీలో రాళ్ళు అధికంగా ఏర్పడే వరకు వాటిని గుర్తిచడంపై నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ఫలితంగా సర్జరీ తప్పా వేరే మార్గం కనిపించదు. అయితే కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయనే సంగతి కొన్ని లక్షణాల ద్వారా మనం గుర్తించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.. !

సాధారణంగా కిడ్నీలో రాళ్ళు ఏర్పడితే.. వీపు కింద ఎడమ వైపు లేదా కుడి వైపు తరచూ నొప్పిగా ఉంటుంది. ఇంకా మూత్ర విసర్జన చేసే టైమ్ లో కూడా మంట, నొప్పి వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుందా వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇంకా కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లైతే మూత్రం తరచూ రావడంతో పాటు.. ఎరుపు రంగులో మూత్రం కనిపిస్తుంది. కొన్ని సార్లు రక్తం కూడా రావోచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లు గమనించాలి.

Also Read:హ్యాపీ బర్త్ డే…రవితేజ

ఇక కిడ్నీలు చెడిపోయిన కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి లేలపోవడం, బరువు తగ్గడం, తరచూ మైగ్రీన్ సమస్య వేధిచడం, ఎక్కువ సేపు కూర్చోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వీటిని ముందే గుర్తించి సరైన వైద్యం తీసుకోవడం ఎంతో మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కిడ్నీ సమస్యలు ముఖ్యంగా రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే ఆహారం విషయంలో తగు జాగ్రతలు పాటించడం చాలా అవసరం. అన్నిటి కంటే ముఖ్యం నీటిని అధికంగా తాగాలి. సి విటమిన్ కలిగిన పండ్లను తినాలి మనం తినే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కాల్షియన్ని ఇచ్చే పదార్థాలు ఎక్కువగా తినాలి. ఇలా మనం తినే ఆహారంలో జాగ్రతలు పాటిస్తే కిడ్నీలో రాళ్ళ ఏర్పడకుండా జాగ్రత పడవచ్చు.

- Advertisement -