‘ది వారియర్’ టీజర్: మాస్‌ పోలీస్‌గా రామ్‌ ఇరగదీశాడు..

12
The Warriorr Teaser

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్, తమిళ డైరెక్ట్‌ర్‌ లింగుస్వామి కాంబోలో ‘ది వారియర్’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక రామ్ ఈ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రంలో క‌న్న‌డ భామ అక్ష‌ర గౌడ కీలక పాత్రలో కనిపించనుంది. ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన బుల్లెట్ సాంగ్ నెట్టింట ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ వదిలారు చిత్రబృందం.

టీజర్‌ విషయానికొస్తే..‘ఒక్కొక్క‌డికి పెడుతున్నాడు..కానీ ఒక‌ట‌ప్ప కొట్టిన వెంట‌నే పెయిన్ కిల్ల‌ర్ ట్యాబ్‌లెట్ ఇస్తాడు..అంటూ రామ్ గురించి ఇంట్ర‌డ్యూస్ చేస్తూ వ‌చ్చే సంభాష‌ణ‌లు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. డిప్యూటీ సూప‌రింటెండ్ ఆఫ్ పోలీస్ స‌త్య పోరీని నేను ‘ అంటూ కృతిశెట్టి చెబుతున్న డైలాగ్స్ థియేట‌ర్ల‌లో మాస్ ట్రీట్‌ను అందించేలా ఉన్నాయి. రామ్ పోలీసాఫీస‌ర్ లుక్‌లో కొత్త‌గా క‌నిపిస్తూ ఫ్యాన్స్ కు విజువ‌ల్ ట్రీట్ అందించేందుకు రెడీ అవుతున్న‌ట్టు టీజ‌ర్‌తో చెప్పేశాడు డైరెక్ట‌ర్. ఆది పినిశెట్టి ఇందులో విల‌న్‌గా నటిస్తున్నాడు.

The Warriorr Teaser (Telugu) | Ram Pothineni, Krithi Shetty | DSP | Lingusamy