టాస్ నెగ్గిన కోల్‌కతా నైట్ రైడర్స్..

23

ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో భాగంగా ఈరోజు ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. పుణేలోని మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో ముందుగా టాస్ నెగ్గిన కోల్‌క‌తా బ్యాటింగ్ ఎంచుకుంది…హైద‌రాబాద్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. శ్రేయస్ అయ్యర్ రెండు మార్పులతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా మూడు మార్పులు చేసింది. ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ కీలకం.

ఇప్ప‌టిదాకా హైద‌రాబాద్ 11 మ్యాచ్‌లు ఆడి 5 విజ‌యాల‌తో 10పాయింట్లు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో 7వ స్థానంలో ఉంది. అదే స‌మ‌యంలో ఇప్ప‌టికే 12 మ్యాచ్‌లు ఆడిన కోల్‌క‌తా 5 విజ‌యాల‌తో 10 పాయింట్లు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో 8వ స్థానంలో ఉంది. ఇరు జ‌ట్ల ఖాతాలో 10 పాయింట్లే ఉన్నా… నెట్ ర‌న్ రేటు అధికంగా క‌లిగిన హైద‌రాబాద్ జ‌ట్టు కోల్‌క‌తా కంటే ఒ మెట్టు పైన ఉంది. ఈ మ్యాచ్‌లో విజ‌యంతో హైద‌రాబాద్‌కు ప్లే ఆఫ్ అవ‌కాశాలు మ‌రింత మెరుగు కానున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడితే కోల్ క‌తాకు ప్లే ఆఫ్ అవ‌కాశాలు మ‌రింత‌గా స‌న్న‌గిల్ల‌నున్నాయి.

తుది జట్లు

కేకేఆర్: వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, స్యామ్ బిల్లింగ్స్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి

సన్ రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో యాన్సెన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్