‘ది వారియర్’.. రికార్డు క్రియేట్‌ చేసిన టీజర్‌..

115
- Advertisement -

టాలీవుడ ఎనర్జిటిక్‌ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ‘ది వారియర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వం వహించాడు. తన కెరియర్లోనే తొలిసారిగా రామ్ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈమూవీని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ సరసన కృతి శెట్టి రొమాన్స్‌ చేయనంది. ఈ సినిమాకు రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్,ఫస్ట్‌ లుక్‌,సాంగ్స్‌కు సూపర్‌ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల రిలీజైన ఈ చిత్ర టీజర్‌కు తెలుగు,తమిళ భాషల్లో కలుపుకుని 20 మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం విశేషం. రామ్ పాత్రను ఎలివేట్‌ చేస్తూ ఈ టీజర్‌ను కట్‌ చేశారు.. రామ్ యాక్షన్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. రౌడీలను కొట్టేసి పెయిన్ కిల్లర్ ఇవ్వడం కొత్తగా అనిపించింది. ఇందులో విలన్‌గా ఆది పినిశెట్టి లుక్‌ను కూడా రివీల్ చేశారు. ఇక ఈ సినిమాను జూలై 14న రిలీజ్‌ చేయనున్నారు.

- Advertisement -