సూపర్‌స్టార్’ రజనీకాంత్ కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 2.O. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. అమీ జాక్సన్ కథానాయికగా నటించింది. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌కు భారీ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్. దీపావళి కానుకగా నవంబర్ 3న చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని చెన్నైలోని సత్యం సినిమాస్‌లో నిర్వహించనున్నారట. అక్కడ ఈ ట్రైలర్‌ని 4డీ సౌండ్ టెక్నాలజీతో విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంత వరకు ఆ టెక్నాలజీతో ఏ ఇండియన్ సినిమా విడుదల కాలేదు. మనం విన్న వార్త నిజమైతే ఆ రికార్డ్ సాధించిన తొలి భారతీయ చిత్రం 2.O అవుతుంది. ఈ చిత్రం దాదాపు రూ.450కోట్లతో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.