పవన్‌ అంతలా పగలబడి నవ్వడానికి కారణం అదేనట..!

377
The Reason behind pawan kalyan laughing at katamarayudu audio ..

పవన్‌ కళ్యాణ్‌ , అలీ ఎంత క్లోజ్‌గా ఉంటారో వేరే చెప్పనక్కర్లేదు.  ఎందుకంటే…పవన్ తన సినిమా ప్రమోషన్‌ వేధిక లలో కూడా  అప్పుడప్పుడు తనకి  ఆలీకి మధ్య ఉన్న  సాన్నిహిత్యం గురించి చెప్తాడు.  ఎందుకంటే పవన్‌ కి  అలీ గుండెకాయలాంటి వాడు.  ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే అలీ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల పంటే.  తన మాటలతో అందర్నీ సందర్భాన్ని బట్టి పంచ్‌లేస్తూ నవ్విస్తుంటాడు.

అయితే  ఇటీవల జరిగిన కాటమరాయుడు ఆడియో వేడుకలో కూడా ఇలాంటి సన్నివేశమే జరిగింది. సడన్‌ గా ఉన్నట్టుండి అలీ ఓ జోక్‌ వేసేశాడు. దాంతో అది విన్న పవన్‌..తన నవ్వుని ఆపుకోలేక పగలబడి నవ్వేశాడు.  ఇక  ఆడియో ఫంక్షన్‌లో ఉన్న వారంతా వారిని వింతగా చూశారు. అసలు పవన్‌ ఏంటీ..ఇలా నవ్వడమేంటి అని అయోమయంలో పడిపోయారు. అంతేకాకుండా ఇది సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది.
The Reason behind pawan kalyan laughing at katamarayudu audio ..
అయితే కొంత మంది మాత్రం  అలీ ఏదో బూతు జోక్‌ వేసుంటాడు…అది వినగానే పవన్‌ కి నవ్వాగక అలా గెంతులేస్తూ నవ్వేసుంటాడని అనుకున్నారంత. పవన్ అలా గెంతుతూ నవ్వడం అందరికీ భలే సరదాగా అనిపించింది.

అయితే  పవన్‌ అలా నవ్వడానికి కారణమేంటో అలీ ఓ ఇంటర్వ్యూలో  చెప్పేశాడు. అలీ మాట్లాడుతూ..పవన్ నవ్వు అభిమానుల్లో అంత చర్చకు దారి తీస్తుందని ఊహించలేదని. ఆ రోజు శరత్ మరార్ గారు పవన్ కళ్యాణ్‌ను అదే పనిగా పొగిడారు. ఆయన డ్రెస్సింగ్.. లుక్ గురించి మాట్లాడారు. నేను ఉన్నట్లుండి.. ‘మళ్లీ పెళ్లి గానీ చేస్తాడా ఏంటి’ అన్నాను.  పవన్ అది విన్నాడు. నవ్వు ఆపుకోలేకపోయాడు” అంటూ అసలు విషయం చెప్పేశాడు ఆలీ. పవన్ దగ్గర ఏదైనా మాట్లాడగలిగే.. అతడి మీద జోకులు కూడా వేయగలిగేంత చనువు ఆలీకి ఉంది. ‘మళ్లీ పెళ్లా’ అంటూ పవన్ ముందే అతడి మీద జోక్ పేల్చగలిగాడంటే ఆలీ పవన్‌కు ఎంత క్లోజో అర్థం అవుతూనే ఉంది.