The RajaSaab:ది రాజాసాబ్ రివ్యూ

9
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించారు.ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ సినిమాలకు పరిమితమైన ప్రభాస్, ఈసారి పూర్తిగా జానర్ మార్చి కామెడీ ఎంటర్టైనర్ చేయాలనే ఉద్దేశంతో ఫాంటసీ హారర్–కామెడీగా ‘ది రాజాసాబ్’ను చేశాడు. తమన్ సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కథ:

రాజు (ప్రభాస్) అనాథ. అతడికి అతని అమ్మమ్మ గంగవ్వ (జరీనా వాహబ్) అంటే ప్రాణం. ఆమె భర్త కనకరాజు (సంజయ్ దత్) కోసం ఏళ్లుగా ఎదురు చూస్తుంటుంది. గంగరాజు (సముద్రఖని) తమ సంపద దోచుకున్నాడని అతడిని పట్టుకోవడానికి వెళ్లిన కనకరాజు తిరిగి రాకపోవడంతో ఆమె మతిమరుపుతో బాధపడుతుంది. అమ్మమ్మ కోరిక మేరకు తాతను తీసుకురావాలని రాజు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో బ్లెస్సీ (నిధి అగర్వాల్), భైరవి (మాళవిక మోహనన్), అనిత (రిద్ధి కుమార్) కథలోకి వస్తారు. నర్సాపూర్ అడవుల్లోని కోటలో జరిగే సంఘటనలు, అక్కడి భూతం, సంపద వెనుకున్న రహస్యం ఏమిటి? అన్నదే కథ.

ప్లస్ పాయింట్స్‌:

ప్రభాస్ కామెడీ, కొత్త లుక్, బీజీఎం, విజువల్స్, వీఎఫ్ఎక్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్. ప్రభాస్ కొత్త లుక్‌లో, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. డాన్స్, రొమాన్స్‌లోనూ మెప్పించాడు. మాళవిక, నిధి, రిద్ధి గ్లామర్ పరంగా ఆకట్టుకున్నారు. సంజయ్ దత్ గంభీరమైన నటనతో ప్రత్యేకంగా నిలిచాడు. జరీనా వాహబ్ అమ్మమ్మ పాత్రలో హృదయాలను గెలిచింది.

మైనస్ పాయింట్స్:

నెమ్మదైన తొలి భాగం, పనిచేయని కామెడీ, బలహీనమైన స్క్రీన్‌ప్లే, బలవంతపు లవ్ ట్రాక్‌లు, ఎక్కువ రన్‌టైమ్.

సాంకేతిక విభాగం:

థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, వీఎఫ్ఎక్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ మరింత కుదించాల్సింది.

తీర్పు:

ఫాంటసీ హారర్–కామెడీగా చెప్పినప్పటికీ, ఇందులో మానసిక థ్రిల్లర్ అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. కథ ఆలోచన కొత్తగా ఉన్నా, స్క్రీన్‌ప్లే బలహీనంగా మారింది. తొలి భాగం నెమ్మదిగా సాగుతుంది. కోటలోకి వెళ్లిన తర్వాత కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నా, చాలా చోట్ల రొటీన్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం బాగుంది. రెండో భాగంలో కొంత కామెడీ పనిచేసినా, ముగ్గురు హీరోయిన్లతో ప్రేమ ట్రాక్‌లు ఎక్కువగా బలవంతంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ బాగా డిజైన్ చేశారు, పార్ట్–2కు లీడ్ కూడా వదిలారు.

రేటింగ్: 2.75 / 5

Also Read:అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రశ్నాపత్రం లీక్!

- Advertisement -