గత కొన్నాళ్లుగా మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న శివసేన పార్టీ రెండుగా చీలిపోయి షిండే వర్గం, థాక్రే వర్గం అంటూ రెండుగా విడిపోయింది. అప్పటి నుంచి అసలైన శివసేన మాదంటే మాది అంటూ రెండు వర్గాలు వివాదానికి తెరతీశాయి. అంతకు ముందు శివసేన పార్టీ నుంచి అధికారంలో ఉన్న ఉద్దవ్ థాక్రే ను గద్దె దించి ఏక్ నాథ్ షిండే బీజేపీ సాయంతో అధికారం చేపట్టిన సంగతి విధితమే. అప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాలు ఏదో ఒక విధంగా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా మహారాష్ట్రలో తిరుగులేని పార్టీగా ఉన్న శివసేన రెండుగా చీలిక రావడంతో అసలైన శివసేన ఎవరిదనే చర్చ గత కొన్నాళ్లుగా జరుగుతోంది.
Also Read: గుజరాత్ మోడల్ వద్దు తెలంగాణ మోడల్ ముద్దు
అయితే మొదటి నుంచి కూడా శివసేన కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉద్దవ్ థాక్రే శివసేనపై తనకే పూర్తి హక్కుందని చెబుతుంటే కాదు కాదు ఎమ్మెల్యేల బలం తనకే ఎక్కువగా ఉందని అందువల్ల శివసేనపై తనకే పూర్తి హక్కులు ఉన్నాయని ఏక్ నాథ్ షిండే చెబుతున్నారు. ఈ వివాదం అటు తిప్పి ఇటు తిప్పి సుప్రీం కోర్టుకు కూడా చేరింది. తాజాగా ఈ వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. చీలిక వర్గానికి శివసేన పార్టీ పై ఎలాంటి హక్కు ఉండదని సుప్రీం కోర్టు షిండే వర్గానికి మొట్టిక్కాయలు వేసింది. బలపరీక్ష ప్రతిపాదికన పార్టీ గుర్తు కేటాయించడం సరైనది కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అయితే అటు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఉద్దవ్ థాక్రే కు కూడా తీర్పు అనుకూలంగా లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే సంక్షోభం విషయమై తుది తీర్పు వెలువడాల్సివుంది. మొత్తానికి అసలైన శివసేన ఎవరిదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.
Also Read: అదే సీన్ రిపీట్ ?.. మరి భయమెందుకు ?