గుజరాత్ మోడల్ వద్దు తెలంగాణ మోడల్ ముద్దు

43
- Advertisement -

తెలంగాణ మోడల్‌ను దేశాభివృద్దికి కీలకమైందని మహారాష్ట్ర కిసాన్ సంఘటన్ ప్రతినిధి కుల్దీప్ కరిపే అన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంను సందర్శించిన అనంతరం సీఎం ఆఫీస్‌లో కేసీఆర్‌ను కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ దేశానికి రోల్ మోడల్‌ అని అన్నారు. సాగు తాగునీటి పంపిణీ సరఫరా దేశానికి తెలంగాణ ఆదర్శమని కొనియాడారు.

ఈసందర్భంగా కుల్దీప్ కరిపే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాతకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. దేశంలో రైతులకు పేద వారికి అణగారిన వర్గాల నాయకుడిగా సీఎం కేసీఆర్‌ అండగా ఉన్నారని అన్నారు. మహారాష్ట్రలో చాలా నదులు ఉన్నాయని కానీ వాటిని ఏవిధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వాలకు తెలియడం లేదని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఉచిత త్రాగునీరు అందిస్తున్నారని కానీ మహారాష్ట్రలో మహిళలు మంచినీళ్ల కోసం కష్టాలు పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు చేస్తలేరని అన్నారు.

దేశవ్యాప్తంగా ఈ పథకాలు అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇక మీద గుజరాత్ మోడల్ అవసరం లేదని తెలంగాణ మోడల్ కావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అని తెలిపారు. రాజకీయ ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలని ప్రతిపక్షాల మీద మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రజల గోసలను తీర్చేందుకు వస్తున్నారని అన్నారు. ప్రతి రోజు 7రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భీమాతో ఒక్క ఆత్మహత్య జరగడం లేదన్నారు. రైతుల కోసం ఆలోచన చేసే నాయకుడు కేసీఆర్ తప్ప దేశంలో ఎవరు లేరు.

రాం భీమ్‌ రావు పాటిల్‌ మాట్లాడుతూ…దళిత బంధు రైతు బంధుతో రైతుల దళితుల ముఖ చిత్రం పూర్తిగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న 24గంటల కరెంట్ తాగునీరు సాగునీటితో ఇక్కడ రైతుల కష్టాలు తీరాయన్నారు. ఇదే తరహా దేశమంతటా అవసరమని అన్నారు. రోజురోజు మహారాష్ట్రలో తెలంగాణ మోడల్‌ అమలు చేయాలని డిమాండ్ పెరుగుతుందని అన్నారు.

Also Read: కే‌సి‌ఆర్ ఎఫెక్ట్.. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ !

మహేష్ పూణే సబ్‌ కా సాత్ సబ్‌ కా వికాస్ అని 10యేండ్ల కింద మోదీ చెప్పారని అది పెద్ద అబద్ధమని అన్నారు. గుజరాత్ మోడల్తో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. రైతే దేశానికి వెన్నెముక అని దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులు ఆదారమని అన్నారు. ఆబ్‌ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో సీఎం కేసీఆర్ వెంట ఎల్లప్పుడూ ఉంటామని అన్నారు.

Also Read: ప్రజల విజయం : ఆప్

- Advertisement -