శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ది ప్యారడైజ్. మార్చి 26 నుంచి జూన్ 2026కి సినిమా విడుదల అవుతుందని ప్రకటించినా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేకపోయినా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యూనిట్ కష్టపడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, నాని అభిమానులు అధికారిక అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో కాయదు లోహార్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, బాబు మోహన్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ సంస్థ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తోంది. ది ప్యారడైజ్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read:విమాన ప్రమాదాలు..మృతి చెందిన నేతలు వీరే!

