విమాన ప్రమాదాలు..మృతి చెందిన నేతలు వీరే!

11
- Advertisement -

మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరుగగా ఈ ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. ఈ విమాన ప్రమాదంలో మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నెలకొనగా ఇప్పటివరకు ఇలా విమాన ప్రమాదాల్లో అనేక మంతి నేతలు మృతి చెందారు. సుభాష్ చంద్ర బోస్ నుండి అజిత్ పవార్ వరకు విమాన ప్రమాదాల్లో మరణించిన వారి వివరాలను చూస్తే..

స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ 1945 ఆగస్టు 18న తైవన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రులుగా ఉండి విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో 2011లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం డోర్జి ఖండు, 2009లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.

విమాన ప్రమాదాల్లో మృతి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ, మాధవరావు సింధియా, అప్పటి లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి, ఎస్. మోహన్ కుమారమంగళం, అలాగే అప్పటి రక్షణ శాఖ సహాయ మంత్రి ఎన్‌వీన్ సోము ఉన్నారు.

కేవలం 34 ఏళ్ల వయసులోనే సంజయ్ గాంధీ 1980 జూన్ 23న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోవడంతో మృతి చెందారు. ఏరోబాటిక్ విన్యాసాల్లో భాగంగా డైవింగ్, లూపింగ్ చేస్తూ నియంత్రణ కోల్పోవడంతో, టీన్ మూర్తి భవన్ సమీపంలో విమానం కూలిపోయింది.

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ పౌర విమానయాన మంత్రి అయిన మాధవరావు సింధియా 2001 సెప్టెంబర్ 30న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు ప్రజా సభను ఉద్దేశించి వెళ్తుండగా సెస్నా విమానం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.తెలుగుదేశం పార్టీ నేత, లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 2002 మార్చి 3న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.

మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ రూపానీ 2025 జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్–గ్యాట్‌విక్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంలో మరణించారు. అయితే విమాన ప్రమాదాల్లో ప్రాణాపాయాల నుంచి తప్పించుకున్న నేతలు కూడా ఉన్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 1977 నవంబర్‌లో అస్సాంలో తన ప్రత్యేక విమానం కూలినప్పటికీ సురక్షితంగా బయటపడ్డారు.

2004లో గుజరాత్‌లో జరిగిన ప్రమాదంలో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రులు పృథ్వీరాజ్ చవాన్, కుమారి శెల్జా ప్రాణాలతో బయటపడ్డారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, మంత్రి ప్రతాప్ సింగ్ బాజ్వా కూడా దాదాపు 10 ఏళ్ల క్రితం గుర్దాస్‌పూర్‌లో టేకాఫ్ అయిన వెంటనే విద్యుత్ తీగలను తాకిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి సేఫ్‌గా బయటపడ్డారు.

Also Read:విమాన ప్రమాదం..అజిత్ పవార్ మృతి

పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఆగస్టు 30న ఫిరోజ్‌పూర్‌లో తన చార్టర్డ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ చేయడంతో సురక్షితంగా బయటపడ్డారు.

- Advertisement -