నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. 14వ రోజున స్వల్పంగా పుంజుకుంది. 13వ రోజుతో పోలిస్తే వసూళ్లు సుమారు 3.2 శాతం పెరిగినట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి.
సాక్‌నిల్క్ అంచనాల ప్రకారం.. 14వ రోజున ‘ది ప్యారడైజ్’ ఇండియాలో రూ.96 లక్షల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా సినిమా మొత్తం నెట్ కలెక్షన్ రూ.118.09 కోట్లకు చేరింది. ఇండియా గ్రాస్ వసూళ్లు రూ.139.17 కోట్లుగా ఉన్నాయి.
ఓవర్సీస్‌లో 14వ రోజున ఈ చిత్రం సుమారు రూ.10 లక్షల గ్రాస్ రాబట్టింది. దీంతో విదేశాల్లో మొత్తం గ్రాస్ కలెక్షన్ రూ.31.15 కోట్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాస్ వసూళ్లు రూ.170.32 కోట్లకు చేరినట్లు అంచనా.
14వ రోజు వసూళ్లలో తెలుగు వెర్షన్‌దే ప్రధాన వాటా. తెలుగు రాష్ట్రాల్లో రూ.93 లక్షల నెట్ రాగా.. హిందీ వెర్షన్ ద్వారా రూ.3 లక్షలు వచ్చాయి. ఏపీ, తెలంగాణలో కలిపి రూ.1 కోటి గ్రాస్, కర్ణాటకలో రూ.2 లక్షలు, మిగతా ప్రాంతాల్లో రూ.5 లక్షల గ్రాస్ నమోదైంది.
Also Read:ఓట్లను దొంగిలించి ప్రధాని అయ్యారు!
సినిమా విడుదలకు ముందు ప్రీమియర్ షోల ద్వారా రూ.11.60 కోట్లు రాబట్టింది. మొదటి రోజు రూ.34.65 కోట్లు, రెండో రోజు రూ.14.90 కోట్లు, మూడో రోజు రూ.15.25 కోట్లు, నాలుగో రోజు రూ.15.70 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత వసూళ్లు క్రమంగా తగ్గినా.. తొలి వారంలోనే రూ.108.20 కోట్లకు చేరుకుంది. రెండో వారంలో 9వ రోజు రూ.2.80 కోట్లు, 10వ రోజు రూ.2 కోట్లు, 11వ రోజు రూ.2.10 కోట్లు, 12వ రోజు రూ.1.10 కోట్లు, 13వ రోజు రూ.93 లక్షలు రాబట్టింది.

