ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాల్సిందే:మోడీ

326
modi
- Advertisement -

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల అభిప్రాయాలు చాలా ముఖ్యమని.. ప్రతిపక్షాలు తమ సంఖ్యాబలం గురించి మర్చిపోవాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. లోక్‌సభ సమావేశాలకు ముందు పార్లమెంట్‌ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన మోడీ పార్లమెంట్ సమావేశాలు ఎలాంటి సంఘర్షణ లేకుండా, ప్రజాధనం వృథా కాకుండా సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

17వ లోక్‌సభ అనుభవం, నవతరం సభ్యులతో కొలువుదీరిందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా అత్యధిక సంఖ్యలో మహిళా ఎంపీలు లోక్‌సభలో ఉన్నారని చెప్పారు మోడీ. ఈ దేశానికి సేవ చేసేందుకు ప్రజలు మరోసారి మాకు అవకాశం ఇచ్చారని చెప్పిన మోడీ ప్రజా ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు.

అనంతరం ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ ..ప్రధానమంత్రి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ నుంచి సురేశ్‌ కొడికున్నిల్‌, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా తదితరులు ప్రమాణస్వీకారం చేశారు.

- Advertisement -