‘సచిన్’ ట్రైలర్ వచ్చేసింది…

203
The official trailer of Sachin
- Advertisement -

క్రికెట్ దేవుడు, ఎంతో మందికి ఇన్ఫిరేషన్, మరెంతోమందికి మోటీవేటర్.. ఇలా సచిన్ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. క్రికెట్ లో ఆయన దేశానికి తెచ్చిన పేరు ఇంతా అంతా కాదు. ఇప్పుడు అతడి బయోపిక్ ఆధారంగా ‘సచిన్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సచిన్ కూడా నటిస్తున్నాడు. ‘సచిన్‌-ఎ బిలియన్‌ డ్రీమ్‌’ అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా  ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. తన జీవితంలోని కొన్ని ముఖ్యమైన క్షణాలను ఈ సినిమా పునరుజ్జీవితం చేసిందని మాస్టర్‌ అన్నాడు.

కానీ జీవితంలో, కెరీర్‌లో ఎదిగేందుకు నాకు సహకారం అందించిన వారి గురించి బాహ్య ప్రపంచానికి వెల్లడించలేదని గుర్తించానని సచిన్‌ విలేకరులతో చెప్పాడు. మరోసారి ప్రజాభిమానం చూరగొనేందుకు సినిమా మరో వేదికగా మారుతుందని భావిస్తున్నట్టు మాస్టర్‌ చెప్పాడు. జేమ్స్‌ ఎర్స్‌కైన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కార్నివల్‌ మోషన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఎ.ఆర్‌. రెహమాన్‌ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఒకప్పుడు బుల్లి తెరను ఏలిన సచిన్‌.. ఇప్పుడు వెండి తెరపై వెలిగిపోతాడని నిర్మాత భాగ్‌ చంద్కా అన్నాడు. టీజర్‌లో మాస్టర్‌ క్రికెట్‌ జీవితంతోపాటు, వ్యక్తిగత, డ్రెస్సింగ్‌ రూమ్‌ ఫుటేజ్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ‘నన్ను అందరూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదిగో. మే 26న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది’ అని ట్వీట్‌ చేశారు.

కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్‌లో  చిన్నతనంలో సచిన్‌ తన తండ్రి వేలు పట్టుకుని వెళ్ళడం, తొలిసారి బ్యాట్‌ పట్టుకున్న ఆనందం, అన్నతో కలిసి క్రికెట్‌ ఆడటం, తోటి పిల్లలతో స్కూల్లో కొట్లాటలతోపాటు బీచ్‌లో తనకెంతో ఇష్టమైన నీలిరంగు షర్టు వేసుకున్న సచిన్‌.. వంటి షాట్స్‌తో ఈ టీజర్‌ని రూపొందించారు. తాజాగా ట్రైలర్‌లో డ్రెస్సింగ్ రూమ్‌కి సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను పొందుపర్చడంతో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది.

https://youtu.be/E_Sm595tecA

- Advertisement -